భారీ వర్షాలతో అతలాకుతలమైన వరంగల్ అర్బన్ జిల్లాలో మరోసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. వరద నీరు వెళ్లేందుకు నాలాలు, డ్రైన్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించారు. భారీ వరదలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఏర్పాట్లు చేశారు.
వరంగల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ప్రశంస - collector rajiv gandhi hanmanthu
వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతిలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. నాలాలు, డ్రైన్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు చేసిన కృషిని కొనియాడారు.
మంత్రి కేటీఆర్ ప్రశంస
వరదల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకున్న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతిలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. వరంగల్ మాదిరి.. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు.