పుర, నగరపాలక ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు - తెలంగాణ వార్తలు
15:24 April 19
పుర, నగరపాలక ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు
పుర, నగరపాలక ఎన్నికలు వాయిదా వేయాలన్న.. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వినతిపత్రం పరీశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా మినీ పుర పోరును వాయిదా వేయాలంటూ షబ్బీర్ అలీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.
ఎన్నికలు తాము నిలిపివేయలేమన్న ఉన్నత న్యాయస్థానం.. ఎస్ఈసీ తగిన నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 7కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:'పబ్లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా'