తెలంగాణ

telangana

ETV Bharat / city

'వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి'

భారీ వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ కమిషనర్లకు సూచించారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్​ రూంలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

municipal department chief secretary arvind kumar
'వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి'

By

Published : Oct 15, 2020, 5:45 AM IST

వర్షాలు, వరదల సహాయక చర్యలను ముమ్మరం చేయాలని.. పురపాలక కమిషనర్​లకు.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​కుమార్​ ఆదేశించారు. హైదరాబాద్ సీడీఎంఎ కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం, తాగు నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.

శిథిలావస్థలోని భవనాలను గుర్తించి.. వాటి పరిసరాల్లోకి ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారుయ. వర్షాలు తగ్గుముఖం పట్టాక ఆయా భవనాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వరద తగ్గిన వెంటనే ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అపార్టుమెంట్​ సెల్లార్​లలో నీటి నిల్వలు లేకుండా చూడాలని సూచించారు.

ఇవీచూడండి:రాజకీయాలు తగవు.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలి: కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details