రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ - మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
![రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ municipal commissionors transfers in state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9436602-thumbnail-3x2-transfers1.jpg)
10:00 November 05
రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ నుంచి కూడా కొందరిని ఇతర పట్టణాలకు బదిలీ చేశారు. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా నియమించారు. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్. శంకర్, వంశీకృష్ణ, సురేందర్ రెడ్డి, సీడీఎంఏ కార్యాలయానికి గీతారాధిక బదిలీ అయ్యారు.
- తాండూరు- జి. శ్రీనివాస్ రెడ్డి
- నార్సింగి- సత్యబాబు
- కొల్లాపూర్- విక్రమ్‌సింహారెడ్డి
- దేవరకొండ- వెంకటయ్య
- భువనగిరి- పూర్ణచందర్‌రావు
- జనగామ- సమ్మయ్య
- నేరేడుచర్ల- గోపయ్య
- తిరుమలగిరి- డి.శ్రీనివాస్
- జహీరాబాద్- సుభాష్ రావు
- నర్సాపూర్- అశ్రిత్‌కుమార్
- చేర్యాల- రాజేంద్రకుమార్
ఇవీ చూడండి:రాజుల కాలపు వైభవాన్ని తలపించేలా.. యాదాద్రి క్షేత్ర రూపకల్పన