తెలంగాణ

telangana

ETV Bharat / city

పురపాలికలు.. ప్రగతి వీచికలుగా మారాలి - muncipal latest news

ఉత్కంఠల నడుమ పురపోరు ముగిసింది. మౌలిక సదుపాయాల కోసం గంపెడాశతో పాలకవర్గాలను ప్రజలు ఎన్నుకున్నారు. కొత్తగా కొలువుదీరిన పురపాలక అధ్యక్ష, ఉపాధ్యక్ష కౌన్సిళ్లు సమన్వయం చేసుకుని అభివృద్ధి ఫలాలను ప్రజల దరికి చేర్చాల్సిన సమయం ఆసన్నమైంది.

muncipal councils in telangana
పురపాలికలు.. ప్రగతి వీచికలుగా మారాలి

By

Published : Jan 28, 2020, 1:07 PM IST

ఊపిరి సలపని ఉత్కంఠల మధ్య సాగిన పురపోరు ముగిసింది. పురాల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. మౌలిక సదుపాయాల కల్పనకోసం గంపెడాశతో గంపగుత్తగా ఓట్లేసిన ప్రజల ఆశలను చిగురింపచేలా పాలకవర్గాలు ప్రగతి పనులు చేయడానికి నడుంబిగించాల్సిన సమయం ఆసన్నమైంది. అడుగడుగునా అసౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న పట్టణాలను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ఛైర్మన్‌తో పాటు, కౌన్సిల్‌ సమష్టిగా, సమన్వయం చేసుకోవాలి. నూతన పురపాలికల్లో తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాలు సైతం అభివృద్ధి ఫలాలను ప్రజల దరికి చేర్చాలి.

ఛైర్మన్‌ విధులు

  • పురపాలికలో పాలనపరమైన అంశాలపై సమీక్ష, అధికారుల పనితీరు, కార్యాలయ నిర్వహణ, అభివృద్ధి పనులపై తనిఖీలు ఛైర్మన్‌ చేయాలి. నిధుల కేటాయింపు, బడ్జెట్‌ రూపకల్పనలో పాలుపంచుకోవాలి. పురపాలిక అధికారులు అక్రమాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం, అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి, తీర్మానాలు చేయవచ్ఛు
  • ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, కౌన్సిల్‌ సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ప్రతి వార్డులో యూత్‌, మహిళ, సీనియర్‌ సిటిజన్‌, రెసిడెన్స్‌ వేల్పేర్‌ ఆసోషియేషన్‌ కమిటీలను ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలి.

కమిషనర్‌ విధులు.. బాధ్యతలు..

  • రోడ్లు, మురికికాలువలు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరణ, రహదారులను శుభ్రంగా ఉంచడం, చెత్తను డంపింగ్‌ యార్డులోకి తరలించడం, అనాథలకు, నిరుపేదలకు రాత్రి వసతి సౌకర్యం కల్పించేలా చూడడం.
  • ప్రయాణ ప్రాంగణాలు, శ్మశాన వాటికల ఏర్పాటు, మురికివాడల అభివృద్ది, వీధి దీపాల ఏర్పాటు, పార్కింగ్‌ స్థలాలు, రోడ్డు విభాగిని నిర్మించడం, ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, జిల్లా పాలనాధికారి పర్యవేక్షణలో పురపాలిక కమిషనర్‌ పనిచేయాలి.

పాలనాధికారి విధులు...

వార్డు కౌన్సిలర్‌, చైర్మన్‌ను సైతం తొలగించే అధికారం పాలనాధికారికి ఉంటుంది. మున్సిపాలిటీల్లో శాఖల మధ్య సమన్వయం చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.

  • జిల్లా స్థాయి గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌, పురపాలిక బడ్జెట్‌ తయారీలో భాగస్వామ్యం, మున్సిపల్‌ లేఅవుట్‌ అప్రూవల్‌ కమిటీకి నేతృత్వం వహిస్తారు. భవన నిర్మాణాలు, లేవుట్‌ సక్రమంగా అమలు కావడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు.

కౌన్సిల్‌లో వార్డు కమిటీలు..

  • ప్రతి వార్డులో నాలుగు వార్డు కమిటీలు నియమిస్తారు. ఈ కమిటీలకు కౌన్సిలర్‌ అధ్యక్షుడిగా, మున్సిపల్‌ అధికారి కన్వీనర్‌గా ఉంటారు.
  • పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించే కార్యక్రమాల పర్యవేక్షణ కోసం యూత్‌, మహిళ, సీనియర్‌ సిటిజన్‌, రెసిడెన్స్‌ వెల్పేర్‌ అసోసిియేషన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తారు.
  • ఈ కమిటీలు పురపాలిక అభివృద్ధి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తాయి. ప్రతీ మూడు నెలలకు విధిగా సమావేశం నిర్వహించి, తీసుకున్న నిర్ణయాలను, మున్సిపల్‌ సమావేశంలో చర్చించాలి.

కౌన్సిలర్‌ విధులు..

  • వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం, మంచినీటి సరఫరా, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పనులపై కౌన్సిలర్‌ పరిశీలన, పారదర్శకంగా ఈపనులు పూర్తి చేసేలా చూడాలి
  • అర్బన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ నిర్వహించే శిక్షణలో భాగస్వామ్యం కావాలి. వార్డు కమిటీలు గుర్తించిన సమస్యలను పరిష్కారం చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వార్డు పరిధిలో ఆయా కాలనీల్లో ఉన్న ధీర్ఘకాలిక సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

ప్రతి నెల కౌన్సిల్‌ సమావేశాలు..

పుర పాలక వర్గాలు ప్రతి నెల కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలి. కౌన్సిల్‌ ఆమోదం లేకుండా అత్యవసర పనులను మంజూరు చేసే అధికారం ఛైర్మన్‌కు ఉన్నా, మళ్లీ కౌన్సిల్‌ ముందు ఈ పనులకు తీర్మానం చేయాలి. ఛైర్మన్‌ వరుసగా పదిరోజుల పాటు అధికార క్షేత్రం నుంచి రాష్ట్రం పరిధి దాటి వెళితే, ఏదేని కారణంతో సమావేశానికి హాజరుకాకపోతే, ఉపాధ్యక్షుడికి ఛైర్మన్‌గా అధికారాలు సంక్రమిస్తాయి. ఛైర్మన్‌ గైర్హాజరయితే కోరం లోని ఓ సభ్యుడిని ఛైర్మన్‌గా సైతం సమావేశం కోసం ఎన్నుకోవచ్ఛు పుర సమావేశాలకు వరుసగా మూడు సార్లు గైర్హాజరయితే సభ్యుడు కౌన్సిలర్‌ అర్హత కోల్పోతాడు.

ఇవీ చూడండి: సాయంత్రం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details