నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపడానికి ప్రయత్నించగా.. ఆ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. కానిస్టేబుల్‌తో గొడవపడుతూనే.. ముందుకు కదిలాడు. ఆ కారును ఎలాగైనా ఆపాలనుకున్న కానిస్టేబుల్.. వాహనం బ్యానెట్ మీదికి ఎక్కి కూర్చున్నారు.ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబయిలో జరిగింది.
VIRAL VIDEO: వీడేం డ్రైవర్ రా బాబు.. బ్యానెట్‌పై కానిస్టేబుల్ ఉన్నా ఆగడం లేదు - మహరాష్ట్ర
ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు ఎంత కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు ఏమాత్రం పాటించడంలేదు. పైగా ట్రాఫిక్ పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ముంబయిలో జరిగింది.

Constable On The Bonnet Of A Car
వీడేం డ్రైవర్ రా బాబు.. బ్యానెట్‌పై కానిస్టేబుల్ ఉన్నా ఆగడం లేదు
అయితే కానిస్టేబుల్ జీవితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు కదిలించాడు. హై స్పీడ్‌తో దాదాపు కిలో మీటర్ వరకు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.