multiplex movie tickets hyderabad: తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే కరోనా విజృంభణ దృష్ట్యా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో.. సగటు ప్రేక్షకుడు చిన్న సినిమాలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించి టికెట్ కొని సినిమా చూసే పరిస్థితి లేదు. అందువల్ల టికెట్ ధరల విషయంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు వెనకడుగు వేశాయి.
సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మల్టీప్లెక్స్‌లలో ధరలు రూ.300 నుంచి రూ.350 చేరుకున్నాయి. అయితే థియేటర్ల యాజమాన్యం తాజా నిర్ణయంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరలు తాజాగా రూ.200, రూ.175, రూ.150కు చేరుకున్నాయి.