Milan 2022: సోమవారం జరగబోయే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. ఈనెల 27న జరుగనున్న బహుళ దేశాల నేవీ విన్యాసం-మిలన్ 2022 కోసం విశాఖ బీచ్ రోడ్ కొత్త రూపు దిద్దుకుంటోంది. సముద్రంపై జరిగే విన్యాసాలు బీచ్ రోడ్‌లో జరిగే పరేడ్‌ను వీక్షించేందుకు వచ్చే వారికి ఈ ప్రాంతమంతా సరికొత్తగా కన్పించనుంది. టీయూ-142 మ్యూజియం, కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం, విక్టరీ ఎట్ సీ వంటివే కాకుండా సాగర తీరంలో ప్రతి ఒక్క విగ్రహాన్ని శుభ్రం చేసి అ ప్రాంతమంతా రంగులు అద్ది.. అందంగా తీర్చిదిద్దారు.
రాష్ట్రపతి హాజరు..
President Fleet Review: ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఆర్కే బీచ్ నుంచి నౌకలు బారులు తీరడాన్ని వీక్షించే వీలుంటుంది. సోమవారం జరగబోయే.. ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరువుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా నేవీ చీఫ్, ఇతర రక్షణదళాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ఇది పూర్తి సముద్రంపైనే సాగుతుంది.