ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది.
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - ఏపీ పరిషత్ ఎన్నికల వార్తలు
15:15 April 07
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ విధించలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం, భాజపా, జనసేన దాఖలు చేసిన పిటిషన్లను విచారణ చేసిన న్యాయమూర్తి... కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించారు.
పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు మంగళవారం రాత్రి అప్పీల్ చేశారు. ఇవాళ విచారించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది.
ఇదీ చదవండి :వామన్రావు హత్య కేసులో పోలీసుల నివేదికపై హైకోర్టు సంతృప్తి