పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఏపీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్ దీపక్ వర్మ బులెటిన్ విడుదల చేశారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా ఉన్న భూపేందర్, రాజీవ్ చంద్రశేఖర్లు కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.
vijayasaireddy : పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి - Parlament committe member
పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఏపీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి(vijayasaireddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్ దీపక్ వర్మ బులెటిన్ విడుదల చేశారు.
విజయసాయిరెడ్డి
ఈ రెండు స్థానాలకు విజయసాయి, భాజపాకు చెందిన సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ పోటీలో లేని కారణంగా.. ఆ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు.
ఇదీ చదవండి:TRS: 'నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభ'