పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారన్న తెదేపా ఆరోపణలను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఖండించారు. ఎత్తు తగ్గిస్తున్నట్లుగా మీకు కలొచ్చిందా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. "పోలవరం పునాది వేసింది మీరు కాదు... పూర్తి చేసే బాధ్యత కూడా మీకు లేదు" అన్నారు.
'పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లుగా మీకు కలొచ్చిందా?' - Vijayasai Reddy comments on polavaram
తెదేపా నేతలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లుగా మీకు కలొచ్చిందా అని ప్రశ్నించారు. అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.
'పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లుగా మీకు కలొచ్చిందా?'
ఏటీఎంలా వాడుకుని బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు. అంతా దీపావళి జరుపుకొంటుంటే తెదేపా నేతలు మాత్రం చీకట్లో పొర్లిపొర్లి ఏడుస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
ఇవీచూడండి:'కొండపోచమ్మ' పరిహారంపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుంది : సుప్రీం