MP Tejasvi Surya On Kishkinda: హనుమంతుని జన్మస్థలం గురించి భాజపా ఎంపీ తేజస్వీ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలోని కిష్కిందే అనడంలో సందేహం లేదని ఉద్ఘాటించారు. కిష్కింద కర్ణాటకలోని కొప్పళ జిల్లా అంజనాద్రిలో ఉందని వివరించారు. భాజపా తలపెట్టిన భారత దర్శన్ యాత్రలో భాగంగా తేజస్వీ ఆదివారం అంజనాద్రి ఆలయాన్ని సందర్శించారు.
భారతదేశం అంతటా పర్యటిస్తున్న సందర్భంగా రామాయణ కాలంతో పోలిన వేలాది ప్రదేశాలను తాను చూశాని.. అందుకే దేన్నీ కాదనలేమని ఆయన తెలిపారు. అయితే వాల్మీకి ఉదాహరణలు.. కిష్కిందను, దాని చుట్టూ పక్క ఉన్న ప్రాంతాలను వివరించిన దానిని బట్టి కర్ణాటకలోని కిష్కిందకి చాలా పోలికలు ఉన్నాయన్నారు. హనుమంతుని జన్మస్థలం కర్ణాటకలోని అంజనాద్రే అని ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు.