MP Suresh Reddy Comments: పార్లమెంటులో చేసిన చట్టాల్లోని హామీలే ఏళ్లుగా నెరవేరకపోతే... చట్టసభలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని తెరాస రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి రాజ్యసభలో వాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చిందని.. బిల్లు ఆమోదం పొంది 8 ఏళ్లు గడిచినా అవి నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన చట్టంలో ఇంకా నెరవేరాల్సినవి 38 అంశాలున్నాయని... వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. పార్లమెంటు వ్యవస్థపై అంచంచల విశ్వాసం ఉన్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు... ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సురేశ్‌రెడ్డి కోరారు.
MP Suresh Reddy Comments: '8ఏళ్లు గడిచినా విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదు' - రాజ్యసభ
MP Suresh Reddy Comments: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని తెరాస ఎంపీ సురేశ్‌రెడ్డి రాజ్యసభలో ఆరోపించారు. చట్టంలో ఇంకా నెరవేర్చాల్సిన అంశాలు 38 ఉన్నాయని.. వాటిన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
"గిరిజన విశ్వవిద్యాలయం, కోచ్ ఫ్యాక్టరీ సహా ఎన్నో హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశాలను పరిష్కరించడానికి కేంద్రం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నా. 8 ఏళ్ల క్రితం బిల్లులు ఆమోదం పొందాయి. ఈ చట్టంలోని అంశాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాజ్యాంగపరంగా కేంద్రంపై ఉంది. న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్లే. పార్లమెంటుపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు. నిర్దిష్ట సమయంలో హామీలు నెరవేర్చేలా మీరు(వెంకయ్య నాయుడు) దిశానిర్దేశం చేయాలని కోరుతున్నా." -సురేశ్‌రెడ్డి, తెరాస ఎంపీ
ఇదీ చూడండి: