తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎన్నికల ప్రయోజనాల కోసం నిధులు దారిమళ్లిస్తున్నారు' - ఏపీ ఆర్థిక పరిస్థితిపై సురేష్ ప్రభు లేఖ

ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల నిధులను ఎన్నికల ప్రయోజనాల కోసం దారిమళ్లిస్తున్నారని, పరిస్థితులు చేయిదాటక ముందే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని... రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ రాశారు. దీంతో పాటు ఏపీ ఛాంబర్​ ఆఫ్ కామర్స్​ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్​ నరేశ్​ కుమార్ తనకు రాసిన లేఖలోని విషయాలను అందులో ప్రస్తావించారు.

sureshcentral minister suresh prabhu letter to minister nirmala on andhrapradesh
'ప్రభుత్వ నిధులను ఎన్నికల ప్రయోజనాల కోసం దారిమళ్లిస్తున్నారు'

By

Published : Dec 3, 2020, 7:59 AM IST

కార్పొరేషన్ల నిధులను సంక్షేమ పథకాలకు తరలించడం వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుందని తద్వారా అభివృద్ధి క్షీణిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ ప్రభు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయని సురేష్‌ ప్రభు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ డైరెక్టర్‌ నరేష్‌ కుమార్‌.. ఈ విషయాలను లేవనెత్తుతూ తనకు రాసిన లేఖను ఆయన కేంద్ర ఆర్థిక మంత్రికి పంపారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కఠినంగా అమలు చేయడంతో పాటు.. పర్యవేక్షణ ఉండాలని నరేష్‌ కుమార్‌ కోరినట్లు సురేష్‌ ప్రభు పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే రుణాలకు 200 శాతం రిజిస్టర్డ్‌, మార్ట్‌గేజ్ విలువతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించగలిగే సత్తా ఉందో లేదో కూడా ప్రతి సంవత్సరం పరిశీలించాల్సి ఉందని, అదే రీతిలో సిబిల్‌ పరిమితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌ నరేష్‌ కుమార్‌ చెప్పిన విధంగా.. ప్రజల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు ఉపయోగించుకుంటున్నాయన్న సురేష్‌ ప్రభు.. ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే వెంటనే కఠిన చర్యలు చేపట్టాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేలు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details