తెలంగాణ

telangana

ETV Bharat / city

RRR issue: 'ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుడి గతి ఏమిటో.?' - AP News

న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్, సభ్యులకు ఏపీ నర్సాపురం ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఆయన లేఖకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్‌లో జవాబిచ్చారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి గతి ఏమిటో అని మాణిక్కం ట్వీట్ చేశారు.

manikkam tagore reply in twitter to mp raghurama krishnam raju
ఎంపీ రఘురామకు మాణిక్కం ఠాగూర్‌ ట్విట్టర్‌లో సమాధానం

By

Published : Jun 3, 2021, 5:14 PM IST

Updated : Jun 3, 2021, 5:56 PM IST

న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్, సభ్యులకు ఆంధ్రప్రదేశ్‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ పోలీసులు తనపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. స్థాయి సంఘం ఛైర్మన్ భూపేంద్ర యాదవ్, సభ్యులకు రఘురామ లేఖ పంపారు. రఘురామ లేఖకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి గతి ఏమిటో అని మాణిక్కం ట్వీట్ చేశారు. ఎంపీపై వ్యవహరించిన తీరు ఏపీ పోలీసుల ఆరాచకానికి నిదర్శనమని ఆయన ట్వీట్​లో పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా రఘురామతో విభేదించినా.. దాడిని ఖండించాలని ట్వీట్ చేశారు.

న్యాయవాద వృత్తికి పొన్నవోలు అనర్హుడు...

రాష్ట్ర అదనపు ఏజీ పొన్నవోలుపై ఏపీ బార్ కౌన్సిల్‌కి ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని ఛానళ్ల వేదికగా పొన్నవోలు తనపై దురుసు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఎంపీ వ్యాఖ్యానించారు. ఏపీ హైకోర్టు సహృదయంతో పొన్నవోలును హెచ్చరించి వదిలేసిందని తెలిపారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టారీతిగా మాట్లాడటం క్షమించరానిదని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాద వృత్తికి పొన్నవోలు అనర్హుడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు.

ఇదీ చదవండి:Wonder: చనిపోయిందనుకొని అంత్యక్రియలు.. కానీ అంతలోనే...!

Last Updated : Jun 3, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details