హైదరాబాద్‌లోని అటవీ భూములపై బస్‌టెర్మినల్ నిర్మాణం చేయడానికి తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాను ఈ అక్రమంపై స్పందించటం వల్లే బస్ టెర్మినల్ కార్యక్రమం వాయిదాపడిందని తెలిపారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసేందుకే రిజర్వాయర్ల డ్రామా ఆడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా చేసే శంకుస్థాపనలే అయితే... ఆదరాబాదరాగా శంకుస్థాపనలు చేయాల్సిన అవసరమేముందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. చెప్పిన సమయానికంటే గంట ముందే వచ్చి వెళ్లిపోవటం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు.
'అటవీ భూములు కాజేసేందుకే బస్టెర్మినళ్లు, రిజర్వాయర్లు' - mp revanth revanth reddy latest news
హైదరాబాద్‌లోని కొత్తపేట, వనస్థలిపురం ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన బస్టెర్మినల్స్... తెరాస నేతల స్వలాభానికేనని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసేందుకే రిజర్వాయర్ల డ్రామా ఆడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు.
mp revanth revanth reddy fire on ktr
కొత్తపేట రిజర్వాయర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని జరిగిన నిరసన ఘటనలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఠాణాకు చేరుకుని ఆందోళన చేపట్టగా... సొంత పూచీకత్తుపై పోలీసులు రేవంత్ రెడ్డిని, కార్యకర్తలను వదిలేశారు.