రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నిర్ణయం వెనుక రైతుల కష్టం, దుఃఖం, బాధే తనలో ఆవేదనను రగిలించాయని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి...అక్కడే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
రైతు భరోసా దీక్షను.. రైతు భరోసా పాదయాత్రగా మారుస్తున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ నుంచే హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు. రాత్రికి ఉప్పునుంతలకుచేరుకొని అక్కడే బసచేశారు.
ఇవాళ ఉదయం పది గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రోజుకు పది కిలోమీటర్ల చొప్పున దాదాపు పది రోజుల పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. సరూర్నగర్ బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుందని తెలిపాయి.