విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతివ్వటం వెనుక దురుద్దేశముందని.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే తెరాస ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు. విభజన హమీలపై పోరాడలేరుగానీ.. విశాఖ ఉక్కు కోసం పోరాడతారా? అని ప్రశ్నించారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే "మద్దతు" ఎత్తుగడ' - vishaka protest latest news
మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు వెనుక దురుద్దేశం ఉందని ఆరోపించారు. గల్లీలో మాటలకు... దిల్లీలో చేతలకు పొంతన కుదరట్లేదని ఎద్దేవా చేశారు.
mp revanth reddy open letter to minister ktr
ఈ మేరకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై పోరాటానికి కలిసి రావట్లేదన్నారు. పార్లమెంట్‌లో పోరాటానికి తెరాస ఎంపీలు మొహం చాటేశారని దుయ్యబట్టారు. మోదీ అంటే భయపడుతున్నారా లేదా రాజీ పడుతున్నారా? అని లేఖలో నిలదీశారు. తెరాస నేతలు గల్లీలో చెప్పే మాటలకు... దిల్లీలో చేతలకు పొంతన కుదరట్లేదని రేవంత్ అనుమానం వ్యక్తంచేశారు.