తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎంకు రేవంత్​రెడ్డి లేఖ.. వెయ్యి కోట్లు విడుదలకు డిమాండ్​ - revanth fires on kcr

సీఎం కేసీఆర్​కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి లేఖ రాశారు. వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరారు. తక్షణమే బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు

mp revanth reddy letter to cm kcr
సీఎంకు రేవంత్​రెడ్డి లేఖ.. వెయ్యి కోట్లు విడుదలకు డిమాండ్​

By

Published : Aug 19, 2020, 3:00 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. పరిహారం కోసం తక్షణం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. మళ్లీ పంట వేసుకునేందుకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

వరదల వల్ల పంట నష్టం తీవ్రత మీకు అర్థం కావడం లేదా అని ముఖ్యమంత్రిని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం చేశారని.. తక్షణమే బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. ముంపునకు గురైన పొలాలు బాగుచేసుకునేందుకు ఎకరాకు రూ.5 వేలు సాయం చేయాలని కోరారు.

ఇవీచూడండి:వరదలను రాజకీయం చేయవద్దు: మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details