తెరాస, భాజపా, ఎంఐఎం కలిసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్, సోమాజిగూడ, గుడిమల్కాపూర్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. భాజపా నాయకులు వాజపేయి విగ్రహాన్ని పెట్టించలేకపోయారని ఆక్షేపించారు. అడ్వాణీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి లాంటి ముఖ్యనాయకులను పాత సామాన్ల మాదిరిగా మోదీ పక్కకు పడేశారని ఎద్దేవా చేశారు.
నీచ రాజకీయాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: రేవంత్ రెడ్డి - ghmc-2020
పీవీ, ఎన్టీఆర్ ఘాట్ విషయంలో భాజపా, ఎంఐఎం నీచ రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నగరం అభివృద్ధి చెందడమే కాకుండా... ఎలాంటి మత విద్వేషాలు జరగలేదన్నారు.
నీచ రాజకీయాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: రేవంత్ రెడ్డి
పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చడాని వచ్చే వారి గుండెల్లో గుణపాలు దింపడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని... వాటిని కాపాడడానికి భాజపా రాజకీయాలు చేయాల్సిన పని లేదన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని, అప్పుడు ఎలాంటి మత విద్వేషాలు జరగలేదన్నారు. అభివృద్ధి, శాంతిభద్రతల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి:మోదీ పర్యటన గురించి నాకు సమాచారమివ్వలేదు: రేవంత్