తెలంగాణ

telangana

బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్

By

Published : Dec 12, 2019, 2:18 PM IST

Updated : Dec 12, 2019, 5:57 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్
బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్

అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించుకున్న తెలంగాణలో... ఆరు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని సమీక్షించుకోవాల్సిన సందర్భం వచ్చిందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రం ఏర్పడితే... ఇప్పుడు 3లక్షల కోట్ల అప్పులతో బాకీల తెలంగాణగా మారిందని విమర్శించారు. కేసీఆర్​ నాయకత్వంలో... రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు. రెండు పడక గదుల ఇళ్లు, రుణమాఫీ, ఎస్సీలకు మూడెకరాల భూమితో సహా ఇచ్చిన అన్ని హామీల అమలులో విఫలమయ్యారని దుయ్యబట్టారు.

సాగునీటి ప్రాజెక్టులకు 2 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేసి... కోటి ఎకరాలకు నీరు ఇస్తానని చెప్పారు. కానీ కొత్తగా లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని రేవంత్​ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో అందమైన కళలు చూపించిన ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఫోర్బ్స్ జాబితాలో కేసీఆర్, కేటీఆర్, మై హోం రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి చేరారంటే... రాష్ట్ర బడ్జెట్​ ఎవరి జేబుల్లోకి వెళ్లింది ఆలోచించాలని ప్రజలను కోరారు. కమీషన్ల కోసమే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. శాంతిభద్రతలు విషయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.

బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్

ఇదీ చూడండి: 'కేసీఆర్​ది బార్​ బచావో.. బార్​ బడావో నినాదం'

Last Updated : Dec 12, 2019, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details