డ్రోన్ కెమెరా కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, మరో నిందితుడు పోరెడ్డి విజయ్ పాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ కృష్ణారెడ్డి, విజయ్ పాల్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
డ్రోన్ కెమెరా కేసు.. 'వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు' - ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి
డ్రోన్ కెమెరా కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, మరో నిందితుడు పోరెడ్డి విజయ్ పాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నతన్యాయ స్థానం విచారించింది.
ts high court
నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసు బనాయించారన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఇదీ చూడండి:రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్