తెలంగాణ

telangana

ETV Bharat / city

పీవీ కుమార్తెను బరిలోకి దింపింది అందుకే : రేవంత్ - telangana graduate mlc elections

తెరాస, భాజపాలు అన్ని వర్గాలను మోసం చేస్తాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​ను ఓడించి, భాజపాను గెలిపించడానికే కేసీఆర్ పీవీ కూతుర్ని పోటీకి దింపారని విమర్శించారు.

mp revanth reddy
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి

By

Published : Feb 23, 2021, 7:50 AM IST

ఇంటికో ఉద్యోగమని చెప్పి కేసీఆర్, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోదీ.. తెలంగాణ ప్రజలను మోసం చేశారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.

ఉద్యోగాల పేరిట తమను మోసం చేసిన కేసీఆర్, మోదీల పార్టీలను యువత తిరస్కరిస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ను ఓడించి, భాజపాను గెలిపించడానికే కేసీఆర్ పీవీ నర్సింహారావు కుమార్తెను పోటీలోకి దింపారని రేవంత్ మండిపడ్డారు. 2005 నుంచి మూడు సార్లు ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో ఆమెను ఎలా బరిలోకి దింపారని నిలదీశారు. ఎవరేం చేసినా.. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details