తెలంగాణ

telangana

ETV Bharat / city

Gift a Smile : 105 మంది దివ్యాంగులకు ట్రై మోటార్‌ వాహనాలు - vehicles to physically handicapped in Hyderabad

కరోనా కాలంలో చేవెళ్ల నియోజకవర్గంలో ఎంతో మందికి సేవలందించారని ఎంపీ రంజిత్ రెడ్డిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్(Minister Ktr) కొనియాడారు. వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్(Gift a Smile) కార్యక్రమంలో భాగంగా.. దివ్యాంగులకు ట్రై మోటార్ వెహికల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

105 మంది దివ్యాంగులకు ట్రై మోటార్‌ వాహనాల పంపిణీ
105 మంది దివ్యాంగులకు ట్రై మోటార్‌ వాహనాల పంపిణీ

By

Published : Sep 18, 2021, 12:03 PM IST

దివ్యాంగులకు ట్రై మోటార్‌ వాహనాలు

వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.... చేవేళ్ల ఎంపీ రజింత్‌ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌(Minister Ktr) ప్రశంసించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో.. ఆర్​ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్‌(Gift a Smile) కార్యక్రమంలో భాగంగా 105 మంది దివ్యాంగులకు ట్రై మోటార్ వెహికల్స్ పంపిణీలో పాల్గొన్నారు.

గతంలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌(Gift a Smile) కార్యక్రమం కింద చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి ఏడు అంబులెన్స్‌లు అందించారని కేటీఆర్(Minister Ktr) తెలిపారు. కరోనా కాలంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు ఆన్​లైన్ పాఠాలు వినేందుకు.. అన్ని గ్రామాలకు డిజిటల్ టీవీలు ఇచ్చారని చెప్పారు. నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతున్న రంజిత్‌ రెడ్డిని మంత్రి అభినందించారు.

"పుట్టిన రోజు, ఇతర వేడుకలకు మనం ఎంతో ఖర్చు చేస్తాం. అలా వృథా ఖర్చు కాకుండా.. ఆ డబ్బు జమ చేసి ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్సులు అందించడమో.. ఇతర సేవా కార్యక్రమాలకో వినియోగించాలని గతేడాది చెప్పాను. దీనికోసం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ రంజిత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు పోకుండా.. వేడుకలు జరపుకోకుండా.. 105 మంది దివ్యాంగులకు ట్రై మోటార్ వాహనాలు అందజేశారు. ఇవే కాకుండా ఆయన తన నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మందికి సేవ చేశారు. ఆయన ఇలాగే ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని.. వీలైనంత మందికి తన సాయాన్ని అందజేయాలని కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే రంజిత్ రెడ్డి."

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి

ABOUT THE AUTHOR

...view details