ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఎనిమిదోవ లేఖ రాశారు. వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలు, పేదలందరికి ఇళ్లు అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. పేదలందరికి ఇళ్లు ఇస్తామన్న హామీతో ప్రజల నుంచి వైకాపాకు మద్దతు లభించిందించన్న రఘురామ... అర్హులందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
MP Raghurama letter: 'ఆ హామీ వల్లే ప్రజల్లో వైకాపాకు మద్దతు లభించింది' - house construction for poor people in andhrapradhesh
పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ హామీ వల్లే ప్రజల్లో వైకాపాకు మద్దతు లభించిందని ఆయన తెలిపారు.
సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
పీఎంఏవై పథకం కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని రఘరామ లేఖలో తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఖర్చుచేస్తామని వైకాపా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. జగనన్న కాలనీల్లో ఇంతవరకు మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాలేదని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Arrest:పేకాటరాయుళ్లపై పోలీసుల కొరడా.. నిందితుల్లో మంత్రి తమ్ముడు