ఏపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన భద్రత వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన భద్రత వద్దని.. కేంద్ర బలగాలతో భద్రత కావాలని పిటిషన్లో కోరారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని.. భద్రత లేనందున వాటికి హాజరుకాలేకపోతున్నానని పేర్కొన్నారు. రేపు రాష్ట్రపతిని కలిసి.. రక్షణ కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. ఏపీలో పరిస్థితి, రాజధానిపై జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతికి వివరిస్తానన్నారు.
'ఏపీ ప్రభుత్వ భద్రత నాకొద్దు.. కేంద్ర బలగాలతో కావాలి' - raghu ramakrishnamraju security issu news
తన భద్రత వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్భం కల్పించిన భద్రత తనకి వద్దని.. కేంద్ర బలగాలతో భద్రత కావాలని పిటిషన్లో కోరారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని.. భద్రత లేకపోవడంతో వాటికి హాజరుకాలేకపోతున్నానని పేర్కొన్నారు.
'ఏపీ ప్రభుత్వ భద్రత వద్దు.. కేంద్ర బలగాలతో కావాలి'
అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కొనసాగించాలి. మా పార్టీ మంత్రి నా పై ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ నిధులను కూడా అమ్మ ఒడి పథకానికి వినియోగిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి నా వంతుగా రూ.3.96 లక్షలు సహాయం అందించాను. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయం అందించాలి.
- ఎంపీ రఘురామకృష్ణరాజు