వైకాపా వెబ్‌సైట్ నుంచి తన పేరు తొలగింపుపై పార్టీ అధ్యక్షుడు జగన్కు.. ఏపీ ఎంపీ రఘురామ లేఖ రాశారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు. వైకాపా తరఫున గెలిచిన తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. పార్టీ నుంచి బహిష్కరించారా? అని సందేహం వ్యక్తం చేశారు.
RRR: పొరపాటున తొలగించారా...? లేక కావాలనే తీసేశారా..? - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు
వైకాపా వైబ్సైట్ నుంచి తన పేరు తొలగించటంపై స్పష్టత కోరుతూ ఏపీ ఎంపీ రఘురామ రాజు లేఖాస్త్రం సంధించారు. సీఎం జగన్కు రాసిన లేఖలో..తన పేరు ఎందుకు తొలగించారో చెప్పాలని కోరారు. పొరపాటున తొలగించారా...? లేక కావాలనే చేశారా..? అని స్పష్టత కోరారు.
YCP MP RRR another letter on Clarification
పొరపాటున తొలగించారా...? లేక కావాలనే చేశారా..? అని స్పష్టత కోరారు. కావాలని తొలగించి ఉంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు. 48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనకు తానుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు.