ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు.. 'జాబ్ క్యాలెండర్'పై ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉంటుందని పాదయాత్రలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీతో నిరుద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.
MP RAGHURAMA: సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ - సీఎం జగన్పై ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్స్
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై... ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు లేఖలు రాసిన రఘురామ.. తాజాగా నాలుగో ఉత్తరాన్ని ముఖ్యమంత్రికి పంపించారు. ఈసారి.. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల హామీని ప్రస్తావించారు.
'గ్రామ సచివాలయాల్లోనే 8,402 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పశుసంవర్ధక శాఖలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 18 వేల ఉపాధ్యాయ పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయి. 6 వేల కానిస్టేబుళ్ల పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకుండా వదిలేశారు. వందల సంఖ్యలో సెక్రటేరియట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3 వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కోర్టు కేసుల కారణంగా అంతంతమాత్రమే భర్తీ అయింది. ప్రచార సందర్భంలో మెగా డీఎస్సీ తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఆశను ఇప్పటివరకు నెరవేర్చలేదు. అత్యవసరం కింద తీసుకుని వెంటనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలి.' అని సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఎంపీ రఘురామ ప్రస్తావించారు.
ఇదీ చదవండి:సీఎంకు రఘురామ నాలుగో లేఖ.. 'ఉద్యోగాల భర్తీ క్యాలెండర్'పై నిలదీత