అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్(Jagan bail) రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు(mp raghurama) దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్(Jagan bail) రద్దు చేయాలని పిటిషన్లో రఘురామ(mp raghurama) కోరారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐ లను గతంలో ఆదేశించింది.
Jagan bail: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ నేడు విచారణ - mp raghurama news
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్(Jagan bail) రద్దు కోరుతూ ఎంపీ రఘురామ(mp raghurama) వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. కౌంటర్‌కు గతంలో లాగా మళ్లీ గడువు పొడిగించనని కోర్టు చెప్పడంతో.. ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
కౌంటర్ దాఖలుకు గడువు కావాలని మే 7న విచారణ సమయంలో జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. తరువాతి దఫా మే 17న విచారణ సమయంలోనూ మరోసారి గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా పదేపదే గడువు కోరడంపై రఘురామ(mp raghurama) తరఫు న్యాయవాదులు ఆ రోజున అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. చివరి అవకాశం ఇస్తూ మే 26కు వాయిదా వేసింది.
అప్పటికీ జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు మళ్లీ గడువు కావాలని కోరారు. కౌంటర్ల పేరుతో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ.. మరోవైపు రఘురామ(mp raghurama)పై తప్పుడు కేసులు వేధిస్తున్నారని.. ఇకపై గడువు ఇవ్వొద్దని న్యాయవాది శ్రీవెంకటేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే చివరి అవకాశం ఇస్తున్నామని పేర్కొన్న సీబీఐ కోర్టు.. విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ సారి కౌంటర్లు దాఖలు చేయకపోతే.. నేరుగా విచారణ చేపడతామని కూడా గత వాయిదాలో న్యాయమూర్తులు స్పష్టం చేశారు.