తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఏపీ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపించండి'.. ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ - mp raghu rama latest news

MP Raghu Rama Krishna Raju: ఏపీ ఆర్థిక స్థితిపై విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాగ్ నివేదిక ఆధారంగా సంబంధిత ఏజెన్సీల ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. విచారణ వేళ సీఎంను ప్రశ్నించాలనే నిబంధన విధించాలని రఘురామకృష్ణరాజు లేఖలో కోరారు.

Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju

By

Published : Mar 28, 2022, 10:27 PM IST

MP Raghu Rama Krishna Raju: ఏపీ ఆర్థిక స్థితిపై కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్‌ఎఫ్‌ఐవో లేదా సీబీఐ ఆర్థిక నేర విభాగంతో విచారణ చేపట్టాలని ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్లు సేకరించడంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

విచారణ వేళ సీఎంను ప్రశ్నించాలనే నిబంధన విధించాలని రఘురామకృష్ణరాజు లేఖలో కోరారు. అప్పులు తీసుకునేటపుడు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఎంపీ.. కార్పొరేషన్ల ద్వారా ఎలా సేకరించారో విచారణ జరిపించాలని కోరారు.

ఇదీ చదవండి:MP Arvind: 'అకారణంగా భాజపా కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు'

ABOUT THE AUTHOR

...view details