mp raghurama letter to dgp: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ దాడి ఘటనపై త్వరతగతిన దర్యాప్తు జరపాలని కోరారు. దర్యాఫ్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసులు పెట్టి తనను చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఉన్నారని తెలిపారు. ఘటనపై స్పీకర్ ఓంబిర్లా నివేదిక కోరినా సవాంగ్ స్పందించలేదని వివరించారు. లోక్‌సభ స్పీకర్‌కు త్వరగా నివేదిక పంపాలని లేఖలో ప్రస్తావించారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరారు.
"సీఐడీ దాడి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలి. దర్యాఫ్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. నాపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. దాడి ఘటనపై స్పీకర్ ఓంబిర్లా నివేదిక కోరినా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదు.పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోండి. నాపై దాడి ఘటన కేసు విషయంలో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి"