తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్యేలంతా నా రక్తం తాగారు: రఘురామకృష్ణరాజు - mp raghurama krishna raju fire on ysrcp leaders

తనను బెదిరిస్తున్న వారి మాటలను సుమోటోగా తీసుకొని వారి వెనుకున్న వారిని గుర్తించి శిక్షించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని కోరారు. మరోసారి వైకాపా నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

mp-raghurama-krishna-raju
mp-raghurama-krishna-raju

By

Published : Sep 23, 2020, 9:54 PM IST

ఎన్నికల్లో తన బొమ్మతోనే నెగ్గానని మరోసారి స్పష్టం చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కొన్ని రోజులుగా పలు అంశాలను మీడియా వేదికగా ప్రస్తావిస్తున్న ఆయన.. పార్టీతో పాటు ఎమ్మెల్యేలంతా తన రక్తం తాగారని ఆరోపించారు. తనను బెదిరిస్తున్న వారి మాటలను సుమోటోగా తీసుకొని వారి వెనుకున్న వారిని గుర్తించి శిక్షించాలని న్యాయస్థానాన్ని రఘురామకృష్ణరాజు కోరారు.

రాజీనామా చేయడానికి తాను ఖాళీగా కూర్చోలేదని అన్నారు. దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం న్యాయస్థానాలేనని వ్యాఖ్యానించారు.

వైకాపా ఎమ్మెల్యేలంతా నా రక్తం తాగారు : ఎంపీ రఘురామకృష్ణరాజు

ఇదీ చదవండి :అవినీతి తిమింగళం: ఏసీపీ ఇంట్లో సోదాలు.. రూ.70 కోట్ల ఆస్తులు

ABOUT THE AUTHOR

...view details