తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎంపీ రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం..! - ఎంపీ రఘురామ తాజా వార్తలు

నరసాపురం ఎంపీ రఘురామ.. బెయిల్​పై సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలు రఘురామ న్యాయవాదులకు ఇంకా చేరనందున.. ప్రక్రియ ఆలస్యమవుతోంది.

ఎంపీ రఘురామ
ఎంపీ రఘురామ

By

Published : May 22, 2021, 12:38 PM IST

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు సోమవారం ఇంటికి చేరే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆయనకు శుక్రవారమే బెయిల్ మంజూరు చేసినా.. ఇప్పటికీ సంబంధిత పత్రాలు న్యాయవాదులకు అందని కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతోంది.

ఇవాళే రఘురామ విడుదలవుతారని అంతా అనుకున్నా.. ప్రక్రియలో ఆలస్యంతో సోమవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ తరఫు న్యాయవాదులు కింది కోర్టులో సోమవారం పూచీకత్తును సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details