Raghurama vs YSRCP MP's: లోక్‌సభ జీరో అవర్‌లో వైకాపా రెబల్ ఎంపీ రఘురామ, ఆ పార్టీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు కల్పించడాన్ని తప్పుబట్టిన రఘురామ.. గాంధేయ పద్ధతిలో యాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకోవటం అన్యాయమన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా.. పోలీసులు అడ్డుకోవటం దురదృష్టకరమన్నారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడమే కాకుండా.. శారీరకంగా హింసిస్తున్నారన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Raghurama vs YSRCP MP's : లోక్‌సభలో రఘురామ, వైకాపా ఎంపీల మాటల యుద్ధం - వైకాపా ఎంపీ రఘురామ తాజా వార్తలు
Raghurama vs YSRCP MP's : లోక్‌సభ జీరో అవర్‌లో వైకాపా రెబల్ ఎంపీ రఘురామ, ఆ పార్టీ ఎంపీల మధ్య వాగ్వాదం నెలకొంది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను హింసిస్తున్నారని రఘురామ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘరామ వ్యాఖ్యలను తప్పుబట్టిన వైకాపా ఎంపీలు.. ఆయనపై ఉన్న సీబీఐ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ycp mp Raghurama raju
దీంతో.. వైకాపా ఎంపీలు రఘురామ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రఘురామ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ మిథున్ రెడ్డి.. ఆయనపై ఉన్న సీబీఐ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా జగన్‌పై వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చండి అని రఘురామ వ్యాఖ్యానించారు.
ఇదీచూడండి:TRS MPs walkout from Lok Sabha: లోక్‌సభ నుంచి తెరాస సభ్యుల వాకౌట్