విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(jagan)కు ఆ రాష్ట్ర ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ(RRR Letter) రాశారు. అన్ని రాష్ట్రాలు బోర్డు పరీక్షలను రద్దు చేశాయని.. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలపై విద్యార్థులల్లో అనిశ్చితి నెలకొందన్నారు. 'నవ ప్రభుత్వ కర్తవ్యాల' పేరుతో రఘురామ నాలుగో లేఖ రాశారు.
RRR Letter: పరీక్షల రద్దుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఎంపీ రఘురామ - తెలంగాణ వార్తలు
ఏపీలో పరీక్షల రద్దుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఎంపీ రాఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్(jagan)కు ఎంపీ రాఘురామ లేఖ(RRR Letter) రాశారు.
RRR Letter: పరీక్షల రద్దుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఎంపీ రఘురామ
కొవిడ్ బారినుంచి పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో పరీక్షల రద్దుపై ఈ నెల 1న ప్రధాని నిర్ణయం తీసుకున్నారని రఘురామ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాలని స్థిర నిర్ణయంతో ఉందని రాఘురామ పేర్కొన్నారు. కరోనా వేళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దు అన్నారు.
ఇదీ చదవండి..WTC Final: టెస్టు ఛాంపియన్షిప్ రిజర్వ్ డే వివరాలివే