తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్ - ఏపీ తాజా వార్తలు

సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనపై దాడి చేశారనే అంశంపై విచారణ జరపాలని పిటిషన్‌ వేశారు.

సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్
సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్

By

Published : Jun 17, 2021, 11:03 PM IST

ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారనే అంశంపై విచారణ జరపాలని పిటిషన్‌ వేశారు. సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్​లో వివరించారు.

ఇప్పటికే ఈ విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న రఘురామ న్యాయవాది... హైకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు అవసరం లేదని చెప్పారు. సీఐడీ పోలీసుల దాడి అంశంపై పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.

ఇదీ చదవండి.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒకరిని కాదు ఇద్దరినీ..

ABOUT THE AUTHOR

...view details