ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా ప్రభావం ఉన్నా పరీక్షలు పెడతామని ఏపీ సీఎం జగన్ అంటున్నారని ఆక్షేపించారు. సుప్రీం జోక్యంతో పరీక్షల గండం నుంచి విద్యార్థులు బయటపడ్డారని అభిప్రాయపడ్డారు. మళ్లీ ఒక విషమ పరీక్షను పాఠశాల విద్యార్థులు ఎదుర్కోబోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి సైతం కరోనా మూడో ముప్పుపై జాగ్రత్తలు చెబుతున్నారన్న ఆయన.. ప్రస్తుతం పాఠశాలలు తెరిస్తే రాబోయే ఉపద్రవాన్ని ఊహించాలన్నారు. పాఠశాలల ప్రారంభంపై సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సలహాదారుల మాటలు వినకుండా.. నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
RRR: రాబోయే ఉపద్రవాన్ని ఊహించి పాఠశాలలు ప్రారంభించండి: రఘురామ
ఏపీలో పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యతిరేకించారు. పాఠశాలల ప్రారంభంపై సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాఠశాలలు తెరిస్తే.. రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
mp-raghu-ramakrishna-raju-slams-ycp-govt-about-schools-reopen-in-andhra-pradesh
'సీఎం జగన్ గారు...పెద్దలు చెప్పిన మాట వినండి. 40 ఏళ్ల పాటు మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. సలహాదారుల మాటలు వినకండి, సీఎం నిజాలు తెలుసుకోవాలి. ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణను అరెస్టుచేసి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. గతంలోనూ ద్వివేది, గిరిజాశంకర్‌లకు శిక్ష విధించి, కోర్టు బోనులో నిలబెట్టారు. దేశంలోని చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు ఇన్నిసార్లు కోర్టుకు రాలేదేమోనని అనుకుంటున్నారు'- రఘురామకృష్ణరాజు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు
ఇవీ చదవండి: