తెలంగాణ

telangana

ETV Bharat / city

MP Raghu Rama: ఏపీ సీఎం జగన్​కు ఎంపీ రఘురామ తొమ్మిదో లేఖ

ఎన్నికల్లో ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావట్లేదని ఏపీ ఎంపీ రఘురామ అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలని ఆ రాష్ట్ర సీఎం జగన్​కు తొమ్మిదవ లేఖ రాశారు.

Raghuramkrishnanraju, R.R.R., MP Raghurama
రఘురామకృష్ణంరాజు, ఆర్​ఆర్​ఆర్, ఎంపీ రఘురామ

By

Published : Jun 18, 2021, 10:37 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు.. ఎంపీ రఘురామకృష్ణరాజు తొమ్మిదో లేఖ రాశారు. తాజా లేఖలో మద్యపాన నిషేధం అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడం లేదని లేఖలో రఘురామ పేర్కొన్నారు. నిషేధం, నియంత్రణ కన్నా మద్యపాన ప్రోత్సాహకం ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాదితో పోల్చితే 16 శాతం మద్యం విక్రయాలు పెరిగాయని వెల్లడించారు.

మద్యపాన నిషేధం విధిస్తామని ఏపీలో మహిళలంతా వైకాపాకు ఓటు వేశారని రఘురామ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆల్కహాల్‌పై వచ్చే ఆదాయాన్ని అమ్మఒడి పథకానికి మళ్లిస్తామని చెప్పారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు భరించలేని విధంగా పన్నులు పెంచాలని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అమ్మఒడి.. నాన్నబుడ్డిలా మారిందని రఘురామ ఆక్షేపించారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు. 'నవ హామీలు- వైఫల్యాల'పై సీఎం జగన్​కు రఘురామ 9 లేఖలు రాశారు.

ఏపీ సీఎం జగన్​కు రఘురామ లేఖ
ఏపీ సీఎం జగన్​కు రఘురామ లేఖ

ABOUT THE AUTHOR

...view details