తెలంగాణ

telangana

ETV Bharat / city

mp raghurama: అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ - ap news

rrr letters to governors
అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ

By

Published : Jun 8, 2021, 3:09 PM IST

Updated : Jun 8, 2021, 3:41 PM IST

15:06 June 08

అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP RAGHURAMAKKRISHNA RAJU) లేఖ రాశారు. త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని రఘురామ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని రఘురామ గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేస్తే... సీఎం జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకుని అక్రమ కేసులు బనాయించేలా చేశారని లేఖలో పేర్కొన్నారు. 

ఏపీ సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి... అక్రమంగా తనను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారని తెలిపిన ఎంపీ.. అరెస్టు చేసిన రోజే.. సీఐడీ కార్యాలయంలో అత్యంత క్రూరంగా హింసించారని.. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు లాఠీలు, రబ్బరు బెల్టులతో చిత్రహింసలకు గురి చేశారని గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడమేగాక.. హింసించడం ఇదే తొలిసారి అని రఘురామ వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే గవర్నర్ల సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తి తనకు మద్దతుగా నిలవాలని గవర్నర్లకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రఘురామ విజ్ఞప్తి చేశారు. 

ఇదీ చూడండి: టీకా తీసుకుంటే ఎఫ్​డీపై అధిక వడ్డీ!

Last Updated : Jun 8, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details