తెలంగాణ

telangana

ETV Bharat / city

mp raghurama slams YSRC Govt: 'క్షవరమైందని రెండేళ్ల తర్వాత తెలిసింది' - వైకాపా ప్రభుత్వంపై ఎంపీ రఘురామ సెటైర్లు

mp raghurama slams YSRC Govt: తనని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీలోని నర్సాపురం నియోజకవర్గ ప్రజలు తిరిగి తనని గెలిపించుకోవాలని కోరారు.

mp raghurama slams YSRC Govt
mp raghurama slams YSRC Govt

By

Published : Jan 13, 2022, 2:51 PM IST

mp raghurama slams YSRC Govt: ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. క్షవరమైతే గానీ వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జగనన్న శఠగోపం అంటూ వాగ్బాణాలు సంధించారు. ఉన్న పీఆర్సీ కొనసాగితే చాలు అనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. భయపడుతున్న ఉద్యోగ సంఘ నేతలను మార్చుకోవాలని.. ఉద్యోగులకు సూచించారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారిని తెచ్చుకోండన్నారు.

"క్షవరం అయ్యిందని ఓటర్లకు రెండేళ్ల తరువాత తెలిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడుతున్నారు. అందరూ దివాలా తీసి కొంపలు అమ్ముకోవాలన్నట్లుగా ఉంది. నా పుట్టలో వేలుపెడితే కుట్టనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. నన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడాలి. నియోజకవర్గ ప్రజలు మళ్లీ నన్ను గెలిపించాలి. నన్ను కొట్టిన ఐదుగురిలో పీవీ సునీల్‌ కుమార్‌ ఉన్నారు"

ABOUT THE AUTHOR

...view details