ఏపీలోనినరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుసీఎం జగన్‌కు లేఖ రాశారు. వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి 65 నుంచి 60కి తగ్గిస్తూ గతేడాది జీవో ఇచ్చారని తెలిపారు. 2019 జులై నుంచి జీవోను అమలు చేస్తామని చెప్పారని.. కానీ ఆ జీవోను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
ఏటా పెంచుతామన్న పింఛన్లను వైఎస్ జయంతి నుంచి అమలు చేయాలని కోరుతూ ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వయోపరిమితి తగ్గిస్తూ ఇచ్చిన జీవోను 2019 జులై నుంచే అమలు చేయాలని కోరారు.
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
దీనివల్ల ఒక్కో లబ్ధిదారు 7 నెలలకు గాను రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. అర్హులకు ఆ మొత్తం అందేలా అధికారులను ఆదేశించాలని లేఖలో ప్రస్తావించారు. ఏటా పెంచుతామన్న రూ.250ను వైఎస్ జయంతి నుంచి అమలు చేయాలని కోరారు. ప్రస్తుత పింఛను మొత్తాన్ని రూ.2,500కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి:ఫీవర్ ఆస్పత్రి డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం