తెలంగాణ

telangana

ETV Bharat / city

RRR letter to amitshah: అమిత్ షాకు ఎంపీ రఘురామ లేఖ - వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు

కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు వైకాపా ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఏపీలో మూడు రాజధానుల సమస్య, ఆర్థిక స్థితిగతులను లేఖలో పేర్కొన్నారు. 3 రాజధానులపై కేంద్రం స్పందించాలని కోరారు.

RRR letter to amitshah
అమిత్ షాకు రఘురామ లేఖ

By

Published : Jul 18, 2021, 4:29 PM IST

ఏపీకి మూడు రాజధానులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి అసెంబ్లీ సవరణ కుదరదని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటే.. పార్లమెంటులోనే చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే.. రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నామని వివరించారు.

జల వివాదం మాదిరిగానే 3 రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు వచ్చాయని.. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వరద బాధితులకు సాయమందించాలి.. కేటీఆర్​కు శ్రవణ్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details