తెలంగాణ

telangana

ETV Bharat / city

పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది: రఘురామకృష్ణరాజు - ఏపీలో కరోనా కేసులు

ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తిస్తున్ననేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. రకారకాల పేర్లతో పథకాలు తీసుకొస్తున్న ప్రభుత్వం... కొవిడ్​ విషయంలోనూ జగనన్న కరోనా కేర్ లేదా మరేదైనా పేరు పెట్టి అమలు చేయాలని సూచించారు.

YCP RAGHURAMA KRISHNAM RAJU
పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది: ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Jul 27, 2020, 4:15 PM IST

కరోనాపై ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలన్నారు.

పథకాలన్నింటికి జగన్‌ పేరు పెట్టుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలోనూ జగనన్న కరోనా కేర్ లేదా మరేదైనా పేరు పెట్టుకోండని సూచించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

ఇవీచూడండి:కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details