కొందరు ప్రచారం చేసినట్లు ఎంపీ పదవికి తాను రాజీనామా చేయలేదని ఏపీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఎవరెన్ని మాట్లాడినా.. లోక్సభ సభ్యత్వం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన సహచర వైకాపా ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై లేవనెత్తకుండా.. ఎవరో భయపెట్టినట్లు బెరుకుగా కనిపించారని వ్యాఖ్యానించారు.
నా లోక్సభ సభ్యత్వం రద్దవ్వటం కళ్లా.. నేను నిబంధనలను అతిక్రమించలేదు. నాపై మోపిన అభియోగాలన్నీ అర్థంలేనివి. లోక్సభ స్పీకర్ను కలిసి వివరణ ఇస్తాను. మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శిగారు అసహనంతో ఉన్నారనేది సుస్పష్టం. ఇవాళ సభలో ప్రధాని మోదీగారు ఉండగానే చాలా దురుసుగా మాట్లాడారు. మా సహచర ఎంపీలను బెదిరించినట్లుగా కనిపిస్తోంది.- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ