ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అప్పుల్లో ఏపీ కొట్టుమిట్టాడుతోందని లేఖలో పేర్కొన్నారు. స్థోమతకు మించి అప్పులు చేసి ఊబిలోకి పోయిందని వివరించారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారన్న రఘురామ... ఏపీఎస్‌డీసీకి ఆస్తులు బదలాయించి తనఖా కార్యక్రమం చేపట్టారని వివరించారు.
ఇప్పటికే రూ.10 వేల కోట్లు అప్పు...
ఇప్పటికే పలు బ్యాంకుల నుంచి ఏపీఎస్‌డీసీ సంస్థ రూ.10 వేల కోట్లు అప్పు తీసుకుందని రఘురామ మోదీకి రాసిన లేఖలో వివరించారు. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. లులు గ్రూపు నుంచి భూములు వెనక్కి తీసుకుని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు చేశారన్న రఘురామకృష్ణరాజు... సుమారు రూ.35 వేల కోట్లకుపైగా అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.