ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఏపీ భవన్ అధికారుల నుంచి అనూహ్య అనుభవం ఎదురైంది. ఎంపీకి ఫోన్ చేసిన అధికారులు... ముఖ్యమంత్రి నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలంటూ.. ఆహ్వానం పలికారు.
ఎంపీని మొదట రమ్మన్నారు.. తర్వాత వద్దన్నారు - jagan video conference
ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ కు రావాలని ఏపీ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ భవన్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ... కాసేపట్లోనే మళ్లీ సందేశం పంపారు. సమావేశానికి హాజరు కావద్దన్నారు.
ఎంపీని మొదట రమ్మన్నారు.. తర్వాత వద్దన్నారు
కాసేపటికే.. అదే ఏపీ భవన్ నుంచి ఎంపీకి మళ్లీ ఫోన్ వెళ్లింది. కాన్ఫరెన్స్‌కు హాజకు కావొద్దంటూ సందేశం వెళ్లింది. ఎందుకని ప్రశ్నించిన ఎంపీకి.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే హాజరు కావద్దని సమాధానం వచ్చింది.
ఇదీ చూడండి :కొత్త రెవెన్యూ బిల్లును మండలిలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్