దిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను ఏపీకి చెందిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ... రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలను వివరించానని చెప్పారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు అమరావతి అంశంపై వినతి పత్రాలను అందించానని తెలిపారు. వ్యక్తిగతంగా ఏ ఘటనల్లో తనపై ప్రభుత్వానికి కోపం వచ్చిందనే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని వివరించారు.
రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించా: వైకాపా ఎంపీ
ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. తన భద్రత విషయమై చర్చించేందుకు రఘురామకృష్ణంరాజు రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతి తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని ఎంపీ చెప్పారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.
'వ్యక్తిగత భద్రతతో పాటు అమరావతి సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాను. ప్రస్తుతం దిల్లీలోనే ఉంటున్నానని వివరించాను. నా విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. చర్యలు తీసుకునేందుకు హామీనిచ్చారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతికి అనుకూలంగా జగన్ అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోనే జగన్...నివాసం కట్టుకున్నారని నాడు వైకాపా నేతలు కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. తప్పు జరిగితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రశ్నిద్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో విశాఖలో రాజధాని ఎలా కడుతారని అడిగే హక్కు ఉంది. కేసుల గురించి భయపడాల్సిన అవసరం వద్దు. అమరావతి గురించి కష్టపడుదాం. విశాఖపట్నం తరలించినా కార్యనిర్వహక రాజధాని అమరావతిలోనే ఉండేలా నిలదీద్దాం. కేవలం ఒక్క కులం పేరుతో తరలించటం ఏ మాత్రం సరికాదు. రాష్ట్రపతి దగ్గర పూర్తి సమాచారం ఉంది. రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. పార్టీపై బురద చల్లే వాడిని కాదు.. బురదను తూడ్చే వాడినే మాత్రమే. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతోంది. రెండు మూడు నెలల్లోనే నిజమైన దోషులెవరనేది బయటపడుతుంది.' - రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇవీ చూడండి:30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మించాం: కేటీఆర్