గత నెల 14 రాత్రి ఏపీ రాష్ట్ర సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్ సహా నలుగురు తీవ్రంగా కొట్టారని ఎంపీ రఘురామ దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి ఛాతీపై కూర్చొని ఫోన్ లాక్ తెరవాలని ఒత్తిడి చేశారని.. తప్పని పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం లాక్ ఓపెన్ చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. కోర్టుకు అందించిన సీజ్ చేసిన వస్తువుల జాబితాలో ఫోన్‌ను చేర్చలేదన్న రఘురామ.. మాజీ ఐఏఎస్ పి.వి. రమేశ్ ట్విట్టర్ సందేశం ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.
వాట్సాప్ సందేశాలు, కాల్స్...
90009 11111 నుంచి రమేశ్‌కు సందేశాలు వెళ్తున్నట్లు ట్విట్టర్ ద్వారా చెప్పారని ఎంపీ రఘురామ వెల్లడించారు. తన ఫోన్ నుంచే సీఐడీ అదనపు డీజీ వాట్సాప్ సందేశాలు, కాల్స్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 14 నుంచి ఈ నెల 1 వరకు తన ఫోన్ దుర్వినియోగం చేశారని వెల్లడించారు. ప్రభుత్వ సేవకుడే చట్టాలను ఉల్లంఘించి నేరపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 119, 379, 403,409, 418, 426, 504, 506 కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:KTR: 10బెడ్ ఐసీయూ ప్రాజెక్టును ప్రారంభించిన కేటీఆర్