తెలంగాణ

telangana

ETV Bharat / city

సమయం చెప్పండి... నేనే వస్తా: ఎంపీ రఘురామకృష్ణరాజు - మిథున్ రెడ్డిపై రఘురామకృష్ణరాజు ఆరోపణల వార్తలు

కొందరు వ్యక్తులు తనకు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆంధ్రప్రదేశ్​ ఎంపీ రఘరామకృష్ణరాజు ఆరోపించారు. అలాంటి వ్యక్తులు సమయం చెబితే... తానే వాళ్ల వద్దకు వెళ్తానని అన్నారు. తన సొంత నియోజకవర్గానికి వెళ్లేందుకు ఎలాంటి భయం లేదన్న ఆయన... కేవలం కరోనా ప్రభావం ఉన్నందునే వెళ్లటం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ చుట్టూ చేరిన కొందరూ వ్యక్తులు ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సమయం చెప్పండి... నేనే వస్తా: ఎంపీ రఘురామకృష్ణరాజు
సమయం చెప్పండి... నేనే వస్తా: ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Sep 17, 2020, 8:24 PM IST

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ చుట్టూ కొందరూ వ్యక్తులు చేరి నటిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. వారిని నమ్ముతున్న ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులను గుర్తిస్తే పార్టీకి మంచి జరుగుతుందని సూచించారు. మంచివాళ్లను, నటించేవాళ్లను గుర్తించే శక్తిని సీఎం జగన్ కు భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నానని చెప్పారు.

'సీఎం జగన్ ను కలిసే అర్హత నాకు లేదంటున్నారు. అలాంటి అవకాశం లేదంటున్నందుకు నాకు బాధగా లేదు. ఇంకా మంచి వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. సీఎం గారూ... మీ పేరు చెప్పి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు పీలేరు నుంచి కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. సమయం, ప్రదేశం చెబితే నేనే వెళ్తాను. ఏం చేస్తారో చూస్తా. నా నియోజకవర్గానికి వెళ్లేందుకు నాకెందుకు భయం? నియోజకవర్గానికి వెళ్తే వేల మంది వస్తారు. కరోనా కారణంగానే నేను వెళ్లటం లేదు '- ఎంపీ రఘురామకృష్ణరాజు

ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశానని ఎంపీ తెలిపారు. దిగ్విజయంగా రామమందిరాన్ని నిర్మించే శక్తిని, ఆరోగ్యాన్ని మోదీకి భగవంతుడు ఇవ్వాలని కోరుకున్నానని చెప్పారు. తిరుపతి ఎంపీ మృతి పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details