తన పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సభ్యుడిగా తాను పార్టీని కాపాడుకోవాలి కాబట్టి కొన్ని సూచనలు చేస్తున్నానని స్పష్టం చేశారు. తన దృష్టిలో చెడు అనుకున్నవి పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు.
RRR: 'నా పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు' - andhrapradesh news
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు మంచిది కాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దేవినేని ఉమ అరెస్ట్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు. కారులో కూర్చున్న వ్యక్తి ఎలా దాడి చేశారో అర్థం కావట్లేదన్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి మారణాయుధం లేకుండా హత్యాయత్నం ఎలా చేశారోనని ప్రశ్నించారు.
'దేవినేని ఉమపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి కొంత అధ్యయనం చేశా. ఓ సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగేలా చట్టం తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు మంచిది కాదు. కారులోనే కూర్చున్న వ్యక్తి ఎలా దాడి చేశారో అర్థం కావట్లేదు. 307 సెక్షన్ కింద కేసు ఎలా నమోదు చేశారో అర్థం కావట్లేదు. ఘటనాస్థలిలో ఎలాంటి మారణాయుధం లేకుండా హత్యాయత్నం ఎలా చేశారో. మారణాయుధం లేదా ఎవరికన్నా గాయాలై ఉంటేనో 307 సెక్షన్ కింద కేసు పెడతారు' -వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఇదీ చదవండి: